సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌ ఆకర్షణీయ ఫలితాలు

ఇన్‌స్టెంట్‌ కాఫీ ఉత్పత్తి సంస్థ సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. ఏకీకృత ఖాతాల ప్రకారం మొత్తం ఆదాయం రూ.423.59

Published : 20 Jan 2022 01:41 IST

రూ.3 మధ్యంతర డివిడెండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఇన్‌స్టెంట్‌ కాఫీ ఉత్పత్తి సంస్థ సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. ఏకీకృత ఖాతాల ప్రకారం మొత్తం ఆదాయం రూ.423.59 కోట్లపై రూ.58.46 కోట్ల నికరలాభాన్ని సంస్థ ఆర్జించింది. త్రైమాసిక ఈపీఎస్‌ 4.40గా నమోదైంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో మొత్తం ఆదాయం  రూ.299.84 కోట్లు, నికరలాభం రూ.47.11 కోట్లు, ఈపీఎస్‌ రూ.3.54 ఉన్నాయి. దీంతో పోల్చితే ప్రస్తుత మూడో త్రైమాసికంలో నికరలాభం 24 శాతం పెరిగింది. వాటాదార్లకు ఒక్కో షేరుపై (రూ.2 ముఖ విలువ) రూ.3 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ చెల్లించాలని సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌ యాజమాన్యం ప్రతిపాదించింది. దీనికి రికార్డు తేదీగా ఫిబ్రవరి 1ని ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు