Published : 20 Jan 2022 01:41 IST

డిసెంబరులో దేశీయ విమాన ప్రయాణికులు 1.12 కోట్లు

దిల్లీ: డిసెంబరులో దేశీయ మార్గాల్లో 1.12 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) వెల్లడించింది. నవంబరులో ప్రయాణించిన 1.05 కోట్ల మందితో పోలిస్తే, ఈ సంఖ్య 6.7 శాతం ఎక్కువ. మొత్తం మీద 2021లో దేశీయ మార్గాల్లో 8.38 కోట్ల మంది ప్రయాణించారు. 2020లో నమోదైన 6.3 కోట్లతో పోలిస్తే ప్రయాణికుల సంఖ్యలో 33 శాతం వృద్ధి ఉంది. 2021 డిసెంబరులో ఇండిగో విమానాల్లోనే 61.41 లక్షల మంది ప్రయాణించారు. మొత్తం విమాన ప్రయాణికుల్లో ఈ సంఖ్య 54.8 శాతం కావడం గమనార్హం. గో ఫస్ట్‌ (ఇంతకుమునుపు గో ఎయిర్‌) 11.93 లక్షలు, స్పైస్‌జెట్‌ 11.51 లక్షలు, ఎయిరిండియా 9.89 లక్షలు, విస్తారా 8.61 లక్షలు, ఎయిరేషియా ఇండియా 7.01 లక్షలు, అలయన్స్‌ ఎయిర్‌ 1.25 లక్షల మంది ప్రయాణికులను చేరవేశాయని డీజీసీఏ గణాంకాలు వెల్లడించాయి. స్పైస్‌జెట్‌ సీట్ల భర్తీ రేటు 86 శాతం కాగా.. ఇండిగో, విస్తారా, గో ఫస్ట్‌, ఎయిరిండియా, ఎయిరేషియా ఇండియాలకు వరుసగా 80.2%, 78.1%, 79%, 78.2 శాతం, 74.2 శాతంగా సీట్ల భర్తీ రేటు ఉందని డీజీసీఏ తెలిపింది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని