Published : 21 Jan 2022 02:53 IST

భారత్‌లో నిరుద్యోగులు 5.3 కోట్ల మంది

గతేడాది చివరి నాటికి: సీఎంఐఈ

దిల్లీ: భారత్‌లో గతేడాది (2021) డిసెంబరు చివరికి 5.3 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియా ఎకానమీ (సీఎంఐఈ) తన విశ్లేషణలో పేర్కొంది. ఇందులో 3.5 కోట్ల మంది ఉద్యోగం కోసం శ్రమిస్తున్నారు. మిగిలిన 1.8 కోట్ల మందికి ఉద్యోగం చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ, ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని పేర్కొంది. ఉద్యోగం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న  3.5 కోట్లమందికి సత్వరం ఉద్యోగావకాశాలను కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఉద్యోగ ప్రయత్నాల జోలికి వెళ్లని వారికి ఉపాధి కల్పించడం ఎంతో సవాలుతో కూడుకున్నదని సీఎంఐఏ వివరించింది.

మహిళలూ ఎక్కువే..
డిసెంబరు చివరినాటికి నమోదైన 5.3 కోట్ల మంది నిరుద్యోగుల్లో మహిళల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఉద్యోగం కోసం తీవ్రంగా అన్వేషిస్తున్న 3.5 కోట్ల మందిలో 23 శాతం లేదా 80 లక్షల మంది మహిళలు కాగా.. మిగిలిన 1.8 కోట్ల మందిలో 90 లక్షల వరకు మహిళలు ఉంటారని వివరించింది. ఇంత ఎక్కువ సంఖ్యలో మహిళలు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే విషయంలో శ్రద్ధ పెట్టకపోవడం వెనక కారణాన్ని వెతకాల్సిన అవసరం ఉందని సీఎంఐఈ పేర్కొంది. వారికి తగిన ఉద్యోగాలు లేకపోవడమా? లేదంటే సమాజం, కుటుంబం నుంచి సహకారం అందకపోవడమా? అనే కారణాన్ని కనుగొనాలని తెలిపింది. కరోనా ప్రభావం పడిన 2020లో ప్రపంచ నిరుద్యోగిత రేటు 55 శాతంగా ఉందని, ఇదే సమయంలో భారత్‌ది 43 శాతంగా ఉందని ప్రపంచ బ్యాంకు గణాంకాలను ఉటంకిస్తూ సీఎంఐఈ పేర్కొంది. సీఎంఐఈ మాత్రం భారత నిరుద్యోగిత రేటును 36 శాతంగా లెక్కగట్టింది. ఉద్యోగకల్పనా రేటు విషయంలో ప్రపంచ ప్రమాణాల స్థాయికి భారత్‌ చేరుకోవాలంటే అదనంగా 18.75 కోట్ల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని సీఎంఐఈ వెల్లడించింది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని