అనుమతి లేకుండా చిన్న స్టోర్లను విక్రయించొద్దు

ఫ్యూచర్‌ రిటైల్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఆర్‌ఎల్‌) కనుక చిన్న ఫార్మాట్‌ స్టోర్లను, తమ అనుమతి లేకుండా విక్రయిస్తే నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని వివరిస్తూ ఎఫ్‌ఆర్‌ఎల్‌ స్వతంత్ర డైరెక్టర్లకు అమెజాన్‌ లేఖ రాసింది. నగదు

Published : 21 Jan 2022 02:53 IST

అవసరమైతే సాయం అందిస్తాం
ఫ్యూచర్‌ రిటైల్‌ స్వతంత్ర డైరెక్టర్లకు అమెజాన్‌ లేఖ

దిల్లీ: ఫ్యూచర్‌ రిటైల్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఆర్‌ఎల్‌) కనుక చిన్న ఫార్మాట్‌ స్టోర్లను, తమ అనుమతి లేకుండా విక్రయిస్తే నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని వివరిస్తూ ఎఫ్‌ఆర్‌ఎల్‌ స్వతంత్ర డైరెక్టర్లకు అమెజాన్‌ లేఖ రాసింది. నగదు సంక్షోభం వల్ల ఆర్థిక ఆందోళనకర పరిస్థితి ఎదురవుతున్న ఫ్యూచర్‌  సంస్థకు సాయం చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ‘ఈజీడే’, ‘హెరిటేజ్‌ ఫ్రెష్‌’ వంటి స్మాల్‌ ఫార్మాట్‌ స్టోర్‌ బ్రాండ్లను ఎఫ్‌ఆర్‌ఎల్‌ విక్రయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిందని మీడియా వర్గాల ద్వారా తెలుసుకున్న అమెజాన్‌ ఈ మేరకు ఆ సంస్థ స్వతంత్ర డైరెక్టర్లకు లేఖ రాసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని