భారత్‌ హవా నడుస్తోంది

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా కొనసాగాలంటే తగిన పరిస్థితులను భారత్‌ సృష్టించుకోవాల్సిన అవసరం ఉందని డెలాయిట్‌ సీఈఓ పునిత్‌ రెంజెన్‌ తెలిపారు. కొవిడ్‌-19పై

Published : 21 Jan 2022 02:53 IST

అనుకూలతలను అందిపుచ్చుకోవాలి
డెలాయిట్‌ సీఈఓ

దిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా కొనసాగాలంటే తగిన పరిస్థితులను భారత్‌ సృష్టించుకోవాల్సిన అవసరం ఉందని డెలాయిట్‌ సీఈఓ పునిత్‌ రెంజెన్‌ తెలిపారు. కొవిడ్‌-19పై జరుపుతున్న పోరాటంలోనూ విజయవంతం అవుతామనే నమ్మకాన్ని కల్పించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌కు అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని సూచించారు. 2022లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ నిలుస్తుందని, 8-9 శాతం మధ్య వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి కొవిడ్‌-19 మహమ్మారి అవరోధంగా నిలుస్తోందని, ముందుగా దీనిపై పోరాటంలో విజయవంతం అయ్యేందుకు దృష్టి సారించాలని అన్నారు. కొవిడ్‌-19 కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రభావం అందరిపైనా ఉంటుందని.. ప్రపంచం, సరఫరా వ్యవస్థలు సహా భారత్‌పైనా ప్రభావం చూపుతుందని చెప్పారు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధిపరంగా భారత్‌ ముందు ఉంటుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. రాబోయే పదేళ్లలో భారత్‌ 6-8 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, పరిమాణం పరంగా మూడో స్థానంలో ఉంటుందని తాను అంచనా వేస్తున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని