Published : 21 Jan 2022 02:53 IST

ఫిబ్రవరిలో ఎమ్‌క్యూర్‌ ఫార్మా రూ.5000 కోట్ల ఇష్యూ!

దిల్లీ: దేశంలోని ఔషధ కంపెనీల్లో 12వ స్థానంలో ఉన్న ఎమ్‌క్యూర్‌ ఫార్మా, ఫిబ్రవరి ప్రారంభంలో పబ్లిక్‌ ఇష్యూకు వచ్చే అవకాశం ఉంది. ఐపీఓ నిమిత్తం సంస్థ సమర్పించిన ముసాయిదా పత్రాలకు నియంత్రణ సంస్థల అనుమతులు లభించాయి. ప్రతిపాదిత పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించాలని కంపెనీ అనుకుంటోంది. ఇష్యూలో బాగంగా రూ.1,100 కోట్ల విలువైన తాజా షేర్లను విక్రయించనుంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా ప్రమోటర్లు కొంత వాటాను విక్రయించనున్నారు. ఈ నిధుల మూలధన వ్యయాల అవసరాలకు కంపెనీ వినియోగించనుంది. కంపెనీలో వ్యవస్థాపక ఎండీ సతీష్‌ మెహ్తాకి 41.92 శాతం, ఆయన కుమారుడు సునీల్‌ మెహ్తాకి 6.13 శాతం వాటాలున్నాయి. ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థలు, వ్యక్తులకు కలిపి మరో 33.55 శాతం వాటాలు, ప్రైవేటు ఈక్విటీ దిగ్గజం బెయిన్‌ క్యాపిటల్‌కు 13.09 శాతం వాటాలున్నాయి.

* హెచ్‌ఐవీ ఔషధాలు, గైనకాలజీ, రక్త సంబంధిత చికిత్సా ఔషధాలను ఎమ్‌క్యూర్‌ తయారు చేస్తోంది. దేశీయ విపణిలో అత్యధికంగా విక్రయమయ్యే 300 బ్రాండ్లలో ఈ సంస్థవి 7 ఉన్నాయి. 4600 మంది ఉద్యోగులున్నారు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని