
27 నుంచి అదానీ విల్మర్ ఐపీఓ
దిల్లీ: ఫార్చూన్ బ్రాండుపై వంట నూనెలు విక్రయించే అదానీ విల్మర్ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ఈనెల 27న ప్రారంభమై 31న ముగుస్తుందని అదానీ ఎంటర్‌ప్రైజెస్ తెలిపింది. ఇష్యూలో బాగంగా రూ.3,600 కోట్ల విలువైన తాజా షేర్లను అదానీ విల్మర్ విక్రయిస్తుంది. ఈ నిధుల నుంచి రూ.1,900 కోట్లను మూలధన వ్యయాల కోసం, రూ.1,100 కోట్లను రుణాల చెల్లింపునకు, రూ.500 కోట్లను వ్యూహాత్మక కొనుగోళ్లు, పెట్టుబడుల నిమిత్తం అదానీ విల్మర్ వినియోగించనుంది. రూ.37,195 కోట్ల ఆదాయంతో దేశంలోని ప్రముఖ ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీల్లో ఒకటిగా అదానీ విల్మర్ ఉంది. అదానీ గ్రూపు, సింగపూర్‌కు చెందిన విల్మర్ గ్రూపుల సంయుక్త సంస్థే అదానీ విల్మర్.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.