ఉన్నత విద్యలో 3.50 కోట్ల హైబ్రిడ్‌ సీట్లు

ప్రభుత్వం, విద్యాసంస్థలు, పరిశ్రమలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు. నీతి ఆయోగ్‌ భాగస్వామ్యంలో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) నిర్వహించిన

Published : 21 Jan 2022 03:00 IST

నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌

హైదరాబాద్‌: ప్రభుత్వం, విద్యాసంస్థలు, పరిశ్రమలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు. నీతి ఆయోగ్‌ భాగస్వామ్యంలో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) నిర్వహించిన దృశ్యమాధ్యమ సదస్సులో ఆయన మాట్లాడారు. ‘ప్రస్తుతం కంటే మెరుగ్గా ప్రభుత్వం, విద్యాసంస్థలు, పరిశ్రమ కలిసి పనిచేయాలి. అందుకు అనువైన వేదికలను రూపొందించాలి. ఇలాంటి వాటి కోసం ఐఎస్‌బీ, నీతి ఆయోగ్‌ సహకారం ఇచ్చిపుచ్చుకోవాలి. ఇతర విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేయడం ప్రారంభించాం. ఈ ప్రక్రియ మరింత దూకుడుగా వెళ్లాలి. సిలికాన్‌ వ్యాలీ, బోస్టన్‌, బ్రిటన్‌ గోల్డన్‌ ట్రయాంగిల్‌ అన్నీ ఈ కోవకు చెందినవే. ఒక లక్ష్యంతో అందరం కలిసి పనిచేసే విధంగా ప్లాట్‌ఫామ్‌ తయారుచేయాలి’ అని రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు. స్థూల ఎన్‌రోల్‌మెంట్‌ నిష్పత్తి భారత్‌లో 27 శాతం కాగా.. ప్రపంచ సగటు 37 శాతంగా ఉందన్నారు. దేశంలో 900 విశ్వవిద్యాలయాలు, 39,000 కళాశాలలున్నా, ఉన్నత విద్యలో మరో 3.50 కోట్ల మంది విద్యార్థులకు అవకాశాలు కల్పించాల్సి ఉందని తెలిపారు. వీరికి హైబ్రిడ్‌ (తరగతులు+ ఆన్‌లైన్‌) పద్ధతిలో నిర్వహించాలని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని