
టయోటా హైలక్స్ ఎస్‌యూవీ
దిల్లీ: దేశీయ విపణిలోకి దిగ్గజ ఎస్‌యూవీ మోడల్ హైలక్స్‌ను తీసుకొచ్చినట్లు టయోటా కిర్లోస్కర్ మోటార్ వెల్లడించింది. హైలక్స్ ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయని, ఏప్రిల్ నుంచి వినియోగదారులకు ఈ వాహనాన్ని డెలివరీ చేస్తామని సంస్థ తెలిపింది. 2.8 లీటర్ డీజిల్ పవర్‌ట్రైన్ కలిగిన ఈ కారు మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లలో లభించనుంది. 4+4 డ్రైవ్, 700ఎంఎం వాటర్ వేడింగ్ సామర్థ్యం సహా పలు అధునాతన భద్రతా ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ మోడల్ ధరను టయోటా కిర్లోస్కర్ వచ్చేనెలలో ప్రకటించే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందిన హైలక్స్ కార్లను భారత్‌కు తీసుకురావడం ఆనందంగా ఉందని, ఇప్పటి వరకు 180కు పైగా దేశాల్లో 2 కోట్ల హైలక్స్ కార్లు అమ్ముడుపోయాయని టయోటా కిర్లోస్కర్ ఎండీ మసకజు యోషిమురా పేర్కొన్నారు. కర్ణాటకలోని బిడది ప్లాంట్ నుంచి ఈ కారును ఉత్పత్తి చేయనున్నామని, 30 శాతం స్థానిక భాగాలను వినియోగించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఎలక్ట్రానిక్ డ్రైవ్ స్విఛ్, ఎలక్ట్రానిక్ డిఫ్ లాక్, డౌన్‌హిల్ అసిస్ట్ కంట్రోల్, 7 ఎయిర్‌బ్యాగ్‌లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.