బీఎండబ్ల్యూ కొత్త ఎక్స్‌3

జర్మనీ విలాసకార్ల సంస్థ బీఎండబ్ల్యూ ఎస్‌యూవీ మోడల్‌ ఎక్స్‌3లో కొత్త వెర్షన్‌ను దేశీయ విపణిలోకి విడుదల చేసింది. స్థానికంగా తయారు చేసిన కొత్త ఎక్స్‌3 పెట్రోల్‌ కారు రెండు వేరియంట్లలో రూ.59.9 లక్షలు, రూ.65.9 లక్షల

Updated : 21 Jan 2022 12:08 IST

దిల్లీ: జర్మనీ విలాసకార్ల సంస్థ బీఎండబ్ల్యూ ఎస్‌యూవీ మోడల్‌ ఎక్స్‌3లో కొత్త వెర్షన్‌ను దేశీయ విపణిలోకి విడుదల చేసింది. స్థానికంగా తయారు చేసిన కొత్త ఎక్స్‌3 పెట్రోల్‌ కారు రెండు వేరియంట్లలో రూ.59.9 లక్షలు, రూ.65.9 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) శ్రేణిలో లభించనుంది. ఇందులో డీజిల్‌ వేరియంట్‌ను త్వరలో తీసుకొస్తామని సంస్థ వెల్లడించింది. కొత్త ఎక్స్‌3కి మరిన్ని మెరుగులు దిద్దామని, ప్రీమియం ఇంటీరియర్‌, అధునాతన ఇన్ఫోటైన్‌మెంట్‌ వ్యవస్థ, కొత్త ఫీచర్లను చేర్చామని, మూడో తరం బీఎండబ్ల్యూ ఎక్స్‌3 విజయవంతమవుతుందని కంపెనీ అధ్యక్షుడు విక్రమ్‌ పవా పేర్కొన్నారు. ఈ కారు గంటకు 0-100 కి.మీ వేగాన్ని కేవలం 6.6 సెకన్లలోనే అందుకుంటుందని, గరిష్ఠ వేగం గంటకు 235 కి.మీ అని కంపెనీ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని