
భీమ జ్యువెలర్స్ ప్రచారకర్తగా పూజా హెగ్డే
హైదరాబాద్: బెంగళూరుకు చెందిన పసిడి ఆభరణాల ప్రముఖ సంస్థ భీమ జ్యువెలర్స్ తమ బ్రాండ్ ప్రచారకర్తగా నటి పూజా హెగ్డేను నియమించింది. పసిడి ఆభరణాల వ్యాపారంలో 97 ఏళ్ల అనుభవం కలిగిన ఈ సంస్థ.. ప్రచారకర్తను నియమించుకోవడం ఇదే ప్రథమం. సంస్థ కొత్త మార్కెట్లలోకి విస్తరిస్తూ, యవతరాన్ని ఆకట్టుకుంటోందని, పూజా హెగ్డే ప్రచారకర్తగా మరింతమంది వినియోగదారులకు చేరువవుతామని భీమ జ్యువెలర్స్ ఎండీ విష్ణుశరణ్ పేర్కొన్నారు. భీమ జ్యువెలర్స్ వంటి గొప్ప సంస్థకు ప్రచారకర్త కావడంపై పూజా హెగ్డే హర్షం వ్యక్తం చేశారు. భీమ జ్యువెలర్స్కు దక్షిణ భారత్, యూఏఈల్లో 50 వరకు విక్రయశాలలు ఉన్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.