23% పెరిగిన హిందుస్థాన్‌ జింక్‌ లాభం

వేదాంతా గ్రూప్‌ సంస్థ హిందుస్థాన్‌ జింక్‌ ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో రూ.2,701 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2020-21 ఇదే కాల లాభం రూ.2,200 కోట్లతో పోలిస్తే ఇది 22.7 శాతం అధికం.

Published : 22 Jan 2022 04:09 IST

దిల్లీ: వేదాంతా గ్రూప్‌ సంస్థ హిందుస్థాన్‌ జింక్‌ ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో రూ.2,701 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2020-21 ఇదే కాల లాభం రూ.2,200 కోట్లతో పోలిస్తే ఇది 22.7 శాతం అధికం. ఏకీకృత ఆదాయం రూ.6,483 కోట్ల నుంచి రూ.8,269 కోట్లకు చేరింది. ‘ఈ ఆర్థిక సంవత్సర తొలి 9 నెలల్లో ఎన్నడూ లేనంతగా లోహ ఉత్పత్తిని చేయగలిగాం.  త్రైమాసికంగానూ అత్యధిక లోహ శుద్ధి చేశాం. ప్రపంచస్థాయి సాంకేతికతలు, పరికరాలపై పెట్టుబడులు పెడుతున్నాం. తద్వారా జింక్‌ అనుబంధ ఉత్పత్తులను దేశీయ విపణిలో అంతర్జాతీయ నాణ్యతతో అందించాలనుకుంటున్నామ’ని సీఈఓ అరుణ్‌ మిశ్రా వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ కోసం అయిదేళ్లలో 100 కోట్ల డాలర్ల (సుమారు రూ.7,500 కోట్లు) పెట్టుబడులు పెడతామని, థర్మల్‌ విద్యుత్‌పై ఆధారపడటం తగ్గించుకుని 2050 నాటికి శూన్య ఉద్గారాల స్థితికి చేరుకునేందుకు ప్రయాణం ప్రారంభించామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని