రూ.3,500 కోట్లు సాయం చేస్తారా?

రుణదాతలకు ఈ నెల 29లోగా చెల్లించాల్సిన బకాయిల కోసం రూ.3,500 కోట్లు ఇచ్చే అంశంపై   స్పష్టత ఇవ్వాల్సిందిగా అమెజాన్‌ను ఫ్యూచర్‌ రిటైల్‌ స్వతంత్ర డైరెక్టర్లు కోరారు. బ్యాంకులు, ఉద్యోగులు, వెండర్లు, ఇతర వాటాదార్లకు

Published : 22 Jan 2022 04:10 IST

 అమెజాన్‌కు ఫ్యూచర్‌ రిటైల్‌ డైరెక్టర్ల లేఖ

దిల్లీ: రుణదాతలకు ఈ నెల 29లోగా చెల్లించాల్సిన బకాయిల కోసం రూ.3,500 కోట్లు ఇచ్చే అంశంపై   స్పష్టత ఇవ్వాల్సిందిగా అమెజాన్‌ను ఫ్యూచర్‌ రిటైల్‌ స్వతంత్ర డైరెక్టర్లు కోరారు. బ్యాంకులు, ఉద్యోగులు, వెండర్లు, ఇతర వాటాదార్లకు ఇవ్వాల్సిన నిధులకు సంబంధించి పరిష్కార ప్రతిపాదనలను అమెజాన్‌ ఇస్తే, వాటిని ఫ్యూచర్‌ రిటైల్‌ న్యాయపరమైన నిబంధనలకు లోబడి మదింపు చేస్తామని స్వతంత్ర డైరెక్టర్లు పేర్కొన్నారు. కంపెనీ ఆర్థిక ఇబ్బందులు తీర్చడంలో సహాయపడతామని సూచిస్తూ, ఫ్యూచర్‌ రిటైల్‌ స్వతంత్ర డైరెక్టర్లకు ఈ నెల 19న అమెజాన్‌ లేఖ రాసింది. దీనిపై ఫ్యూచర్‌ కంపెనీ స్వతంత్ర డైరెక్టర్లు స్పందించారు. ఈ నెల 29లోగా రూ.3,500 కోట్లు బకాయిలు చెల్లించడానికి మూలధన సాయం అవసరమని, లేకుండా మొండి బకాయి (ఎన్‌పీఏ)గా మారుతామని తెలిపారు. అందువల్ల శనివారం (నేడు)లోగా స్పష్టత ఇస్తే ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఫ్యూచర్‌ డైరెక్టర్లు వివరించారు. దీనిపై అమెజాన్‌, ఫ్యూచర్‌ గ్రూప్‌ అధికారికంగా స్పందించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని