223 కోట్ల డాలర్లు పెరిగిన ఫారెక్స్‌ నిల్వలు

దేశ విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు ఈ నెల 14తో ముగిసిన వారానికి 222.9 కోట్ల డాలర్ల మేర పెరిగి 63,496.5 కోట్ల డాలర్లకు చేరినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించింది. ఈనెల 7తో

Published : 22 Jan 2022 04:10 IST

ముంబయి: దేశ విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు ఈ నెల 14తో ముగిసిన వారానికి 222.9 కోట్ల డాలర్ల మేర పెరిగి 63,496.5 కోట్ల డాలర్లకు చేరినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించింది. ఈనెల 7తో ముగిసిన వారంలో ఫారెక్స్‌ నిల్వలు 87.8 కోట్ల డాలర్ల మేర తగ్గాయి. సమీక్షా వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు (ఎఫ్‌సీఏలు), పసిడి నిల్వలు అధికమై విదేశీ మారకపు నిల్వల పెరిగిందని ఆర్‌బీఐ తెలిపింది. ఎఫ్‌సీఏలు 134.5 కోట్ల డాలర్ల మేర పెరిగి, 57,073.7 కోట్ల డాలర్లకు చేరాయి. పసిడి నిల్వలు 72.6 కోట్ల డాలర్ల మేర పెరిగి 3,977 కోట్ల డాలర్లకు చేరాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని