Published : 22 Jan 2022 04:10 IST

అంకురాల్లోకి రూ.1.80 లక్షల కోట్లు

2021లో కొత్తగా 2,250 సంస్థలు

నాస్‌కామ్‌-జిన్నోవ్‌ నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: దేశీయ అంకురాల బలాన్ని 2021 చాటి చెప్పింది. కరోనా కల్లోలంలోనూ అంకుర సంస్థలకు పెట్టుబడులు వెల్లువెత్తాయి. గత ఏడాది టెక్‌ అంకురాలు దాదాపు రూ.1.80 లక్షల కోట్ల (24.1 బిలియన్‌ డాలర్ల)ను పెట్టుబడుల రూపంలో ఆకర్షించాయి. శుక్రవారం నాస్‌కామ్‌-జిన్నోవ్‌ విడుదల చేసిన ‘ఇండియన్‌ టెక్‌ స్టార్టప్‌ ఎకోసిస్టం’ నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. కొవిడ్‌ ముందుతో పోలిస్తే.. పెట్టుబడులు రెండు రెట్లు పెరిగాయి. దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై, ముంబయి తదితర నగరాలు 71 శాతం అంకురాలకు వేదిక కాగా.. మిగతా నగరాల్లో 29శాతం అంకురాలు కొలువయ్యాయి.

* 2020తో పోలిస్తే 100 మిలియన్‌ డాలర్లు.. అంతకు మించిన లావాదేవీలు మూడు రెట్లు పెరిగాయి.

* 2,400 మందికి పైగా ఏంజెల్‌ ఇన్వెస్టర్లు అంకురాల్లో పెట్టుబడులకు సిద్ధమయ్యారు.

* పెట్టుబడుల్లో అధిక భాగం అమెరికా నుంచి రాగా, దేశీయ పెట్టుబడిదారులూ మద్దతు పలికారు.

* కొవిడ్‌ పరిణామాల్లోనూ అంకుర రంగం వేగంగా కోలుకుంది. అంకురాల విలువా 2020తో పోలిస్తే రెండు రెట్ల వరకు పెరిగింది.

* 11 అంకురాలు ఐపీఓల ద్వారా దాదాపు రూ.45 వేల కోట్లు (6 బిలియన్‌ డాలర్లు) సమీకరించాయి.

* ఉద్యోగాల మార్కెట్లోనూ అంకురాలు కీలక భూమిక పోషించాయి. దశాబ్ద కాలంలో స్టార్టప్‌లు 6.6 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు, 34.1 లక్షల వరకు పరోక్ష ఉద్యోగాలను కల్పించాయి.

* బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా, ఎడ్యుటెక్‌, రిటైల్‌, రిటైల్‌ టెక్‌, ఫుడ్‌టెక్‌, ఎస్‌సీఎం ఇదులో ప్రధానంగా ఉన్నాయి.  

* 10-12 శాతం అంకురాల్లో వ్యవస్థాపకులు, సహవ్యవస్థాపకులుగా మహిళలు ఉన్నారు.

*దేశంలో ఇప్పటికే ఉన్న 70 యూనికార్న్‌ (రూ.7500 కోట్ల విలువైన సంస్థ)లకు 2022లో మరిన్ని జతవుతాయి.2025కు దేశంలో 200 యూనికార్న్‌లు ఉంటాయని అంచనా.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని