హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ డిసెంబరు త్రైమాసికంలో రూ.273.65 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2020-21 ఇదే కాల లాభం రూ.264.99 కోట్లతో పోలిస్తే ఇది 3 శాతం అధికం. మొత్తం ఆదాయం మాత్రం రూ.21,126.80 కోట్ల

Published : 22 Jan 2022 04:10 IST

లాభం రూ.274 కోట్లు

దిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ డిసెంబరు త్రైమాసికంలో రూ.273.65 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2020-21 ఇదే కాల లాభం రూ.264.99 కోట్లతో పోలిస్తే ఇది 3 శాతం అధికం. మొత్తం ఆదాయం మాత్రం రూ.21,126.80 కోట్ల నుంచి రూ.14,222.22 కోట్లకు పరిమితమైంది. కంపెనీ సాల్వెన్సీ నిష్పత్తి  202 శాతం నుంచి 190 శాతానికి తగ్గింది. జనవరి 1న 8,70,22,222 ఈక్విటీ షేర్లను ఒక్కోటి రూ.685 చొప్పున ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో కేటాయించడంతో పాటు రూ.725.98 కోట్ల నగదును ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌కు చెల్లించినట్లు కంపెనీ తెలిపింది. దీంతో ఎక్సైడ్‌ లైఫ్‌లో 100 శాతం వాటా కొనుగోలు చేసినట్లు పేర్కొంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఎక్సైడ్‌ లైఫ్‌ తమ పూర్తి స్థాయి అనుబంధ సంస్థగా మారిందని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని