
తాన్లా ఆదాయం రూ.885 కోట్లు
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన కమ్యూనికేషన్ సేవల సంస్థ తాన్లా ప్లాట్ఫామ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.884.9 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2020-21 ఇదేకాల ఆదాయం రూ.654.1 కోట్లతో పోలిస్తే ఇది 35.3శాతం అధికం. ఇదే సమయంలో నికర లాభం రూ.93.5 కోట్ల నుంచి 69శాతం వృద్ధి చెంది రూ.158 కోట్లకు చేరింది. మూడు త్రైమాసికాల్లో కలిపి మొత్తం ఆదాయం రూ.2352.9 కోట్లు, నికర లాభం రూ.398.7 కోట్లుగా ఉంది. అన్ని విభాగాల్లో మెరుగైన పనితీరుతో మంచి ఫలితాలు సాధించినట్లు తాన్లా ప్లాట్ఫామ్స్ వ్యవస్థాపక ఛైర్మన్, సీఈఓ ఉదయ్ రెడ్డి అన్నారు. వరుసగా 22 త్రైమాసికాల్లో వృద్ధి నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.