34 శాతం పెరిగిన గ్లాండ్‌ ఫార్మా లాభం

గ్లాండ్‌ ఫార్మా ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 273 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2020-21 ఇదేకాల లాభం రూ.204 కోట్లతో పోలిస్తే, ఈసారి 34 శాతం పెరిగింది. ఇదే సమయంలో త్రైమాసిక ఆదాయం

Published : 22 Jan 2022 04:10 IST

ఈనాడు, హైదరాబాద్‌: గ్లాండ్‌ ఫార్మా ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 273 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2020-21 ఇదేకాల లాభం రూ.204 కోట్లతో పోలిస్తే, ఈసారి 34 శాతం పెరిగింది. ఇదే సమయంలో త్రైమాసిక ఆదాయం రూ.859 కోట్ల నుంచి 24 శాతం వృద్ధితో రూ.1,063 కోట్లకు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల కాలానికి గ్లాండ్‌ ఫార్మా ఆదాయం రూ.3,297 కోట్లు, నికరలాభం రూ.925 కోట్లు నమోదయ్యాయి. అమెరికా మార్కెట్లో తమ అమ్మకాలు 23 శాతం పెరిగాయని, ఇతర దేశాల్లోనూ వృద్ధికి ప్రయత్నిస్తున్నట్లు గ్లాండ్‌ ఫార్మా సీఈఓ శ్రీనివాస్‌ సాదు తెలిపారు. సమీక్షా త్రైమాసికంలో 4 సంక్లిష్ట ఇంజెక్టబుల్‌ ఔషధాలకు అనుమతి కోసం దరఖాస్తు చేశామని, తద్వారా సమీప భవిష్యత్తులో ఇదే తరహా వృద్ధిని కొనసాగించటానికి సిద్ధమవుతున్నట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని