బంధన్‌ బ్యాంక్‌ ఆకర్షణీయ ఫలితాలు

డిసెంబరు త్రైమాసికంలో బంధన్‌ బ్యాంక్‌ రూ.859 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే కాల లాభం రూ.633 కోట్లతో పోలిస్తే ఇది 36 శాతం అధికం. కేటాయింపులు తగ్గడం ఇందుకు దోహదపడింది.

Published : 22 Jan 2022 04:10 IST

ముంబయి: డిసెంబరు త్రైమాసికంలో బంధన్‌ బ్యాంక్‌ రూ.859 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే కాల లాభం రూ.633 కోట్లతో పోలిస్తే ఇది 36 శాతం అధికం. కేటాయింపులు తగ్గడం ఇందుకు దోహదపడింది. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.2,625 కోట్ల నుంచి 7.7 శాతం వృద్ధితో రూ.2,837 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం రూ.2,071.7 కోట్ల నుంచి 2.6 శాతం పెరిగి రూ.2,124.7 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్‌ 8.3 శాతం నుంచి 7.8 శాతానికి పరిమితమైంది. వడ్డీయేతర ఆదాయం 26.7 శాతం అధికమై రూ.712.3 కోట్లుగా నమోదైంది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) 1.1 శాతం నుంచి 10.81 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.26 శాతం నుంచి 3.01 శాతానికి చేరాయి. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.1077.83 కోట్ల నుంచి రూ.805.71 కోట్లకు తగ్గాయి.
నీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికంలో బ్యాంక్‌ రూ.3009 కోట్ల నష్టాన్ని చవిచూసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని