వొడాఫోన్‌ ఐడియా నష్టం రూ.7,231 కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో వొడాఫోన్‌ ఐడియా ఏకీకృత నష్టం రూ.7,230.9 కోట్లకు పెరిగింది. 2020-21 ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.4,532.1 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఇదే సమయంలో

Published : 22 Jan 2022 04:10 IST

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో వొడాఫోన్‌ ఐడియా ఏకీకృత నష్టం రూ.7,230.9 కోట్లకు పెరిగింది. 2020-21 ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.4,532.1 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఇదే సమయంలో ఏకీకృత కార్యకలాపాల ఆదాయం రూ.10,894.1 కోట్ల నుంచి 10.8 శాతం తగ్గి రూ.9,717.3 కోట్లకు పరిమితమైంది. చందాదారుల సంఖ్య 26.98 కోట్ల నుంచి        24.72 కోట్లకు తగ్గింది. కంపెనీ ఛార్జీలు పెంచడం ప్రతికూల ప్రభావం చూపింది. టారిఫ్‌ పెంపు చేపట్టినప్పటికీ.. వినియోగదారుడిపై సగటు ఆదాయం (ఆర్పు) రూ.121 నుంచి దాదాపు 5 శాతం తగ్గి రూ.115కు పడిపోయింది. డిసెంబరు త్రైమాసికానికి కంపెనీ స్థూల రుణభారం         రూ.1,98,980 కోట్లుగా ఉంది. ‘గత కొన్ని నెలల్లో చేపట్టిన టారిఫ్‌ పెంపు నిర్ణయాల వల్ల వరుసగా రెండో త్రైమాసికంలోనూ ఆదాయ వృద్ధి సాధించాం. మొత్తం చందాదారుల సంఖ్య తగ్గినప్పటికీ.. వీఐ గిగానెట్‌ సేవలతో 4జీ ఖాతాదారుల సంఖ్య బలంగానే ఉంది. మార్కెట్‌లో పోటీ పరిస్థితులను ఎదుర్కొనేందుకు మా వ్యూహాలను అమలు చేయడంపై దృష్టి పెడతాం’ అని వొడాఫోన్‌ ఐడియా ఎండీ, సీఈఓ రవీందర్‌ టక్కర్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని