మెప్పించిన ఐడీబీఐ బ్యాంక్‌

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్న ఐడీబీఐ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో రూ.578 కోట్ల స్టాండలోన్‌ నికర లాభాన్ని ఆర్జించింది. 2020-21 ఇదేకాల లాభం రూ.378 కోట్లతో

Published : 22 Jan 2022 04:10 IST

దిల్లీ: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్న ఐడీబీఐ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో రూ.578 కోట్ల స్టాండలోన్‌ నికర లాభాన్ని ఆర్జించింది. 2020-21 ఇదేకాల లాభం రూ.378 కోట్లతో పోలిస్తే ఇది 53 శాతం అధికం. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.6,003.91 కోట్ల నుంచి రూ.5,772.86 కోట్లకు పరిమితమైంది. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) రూ.1,817 కోట్ల నుంచి 31 శాతం పెరిగి రూ.2,383 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) 2.87 శాతం నుంచి 101 బేసిస్‌ పాయింట్లు మెరుగై 3.88 శాతానికి చేరింది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) 23.52 శాతం నుంచి 20.56 శాతానికి, నికర నిరర్థక ఆస్తులు 1.94 శాతం నుంచి 1.70 శాతానికి మెరుగయ్యాయి. మొత్తం కేటాయింపులు రూ.1,333 కోట్ల నుంచి రూ.1,189 కోట్లకు పరిమితమయ్యాయి. కేటాయింపుల కవరేజీ నిష్పత్తి (సాంకేతిక రైటాఫ్‌లతో కలిపి) 97.08 శాతం నుంచి 97.10 శాతానికి చేరింది. కేపిటల్‌ టు రిస్క్‌ (వెయిటెడ్‌) ఆస్తుల నిష్పత్తి (సీఆర్‌ఏఆర్‌) 14.77 శాతం నుంచి 16.75 శాతానికి మెరుగైంది. స్థూల రుణాలు 5 శాతం పెరిగి రూ.1,67,317 కోట్లకు, డిపాజిట్లు 0.81 శాతం పెరిగి రూ.2,22,578 కోట్లకు చేరాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని