Published : 22 Jan 2022 04:10 IST

4 రోజుల్లో రూ.10.36 లక్షల కోట్లు గల్లంతు

సమీక్ష

సూచీల నష్టాలు నాలుగో రోజూ ఆగలేదు. అంతర్జాతీయ ద్రవ్యోల్బణంపై ఆందోళనలతో ప్రపంచ మార్కెట్లు కుదేలవ్వగా.. మన సూచీలూ అదే బాటలో నడిచాయి. విదేశీ మదుపర్ల అమ్మకాలు స్థిరంగా కొనసాగాయి. చివర్లో కొంత కొనుగోళ్లు రావడంతో నష్టాలు తగ్గాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 8 పైసలు పెరిగి 74.43 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ముగియగా.. ఐరోపా షేర్లు అదే ధోరణిలో ట్రేడయ్యాయి.

* మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ గత నాలుగు ట్రేడింగ్‌ రోజుల్లో రూ.10.36 లక్షల కోట్లు తగ్గి రూ.269.65 లక్షల కోట్లకు దిగివచ్చింది.  
సెన్సెక్స్‌ ఉదయం 59,039.37 పాయింట్ల వద్ద భారీ నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కదలాడిన సూచీ.. ఇంట్రాడేలో 58,620.93 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరింది. ఆఖర్లో కొద్దిగా పుంజుకుని 427.44 పాయింట్ల నష్టంతో 59,037.18 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 139.85 పాయింట్లు కోల్పోయి 17,617.15 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,485.85- 17,707.60 పాయింట్ల మధ్య కదలాడింది.

* పేటీఎం షేరు పతనం కొనసాగుతోంది. ఇంట్రాడేలో రూ.952.95 వద్ద జీవనకాల కనిష్ఠానికి చేరిన షేరు.. చివరకు 3.51% నష్టంతో రూ.959.90 వద్ద ముగిసింది. గత 14 ట్రేడింగ్‌ రోజుల్లో 13 సార్లు నష్టపోవడంతో, కంపెనీ మార్కెట్‌ విలువ రూ.62,000 కోట్లకు పడిపోయింది.

* జొమాటో షేరు 10 శాతం నష్టపోయి 52 వారాల కనిష్ఠమైన రూ.112.55కు చేరింది. చివరకు రూ.113.75 దగ్గర స్థిరపడింది. కంపెనీ మార్కెట్‌ విలువ తొలిసారిగా రూ.లక్ష కోట్ల దిగువకు చేరింది.  కొత్త తరం కంపెనీలైన పీబీ ఫిన్‌టెక్‌, కార్‌ట్రేడ్‌ కూడా నష్టాల్లోనే ట్రేడయ్యాయి.

* ఆకర్షణీయ త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో షాపర్స్‌ స్టాప్‌ షేరు ఇంట్రాడేలో 17% దూసుకెళ్లి రూ.425 వద్ద గరిష్ఠానికి తాకింది. చివరకు 4.76% లాభంతో రూ.378.65 వద్ద ముగిసింది.  బయోకాన్‌ షేరు 3.49% పెరిగి రూ.376.60 దగ్గర స్థిరపడింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 22 నష్టపోయాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 5.37%, టెక్‌ మహీంద్రా 4.44%, టాటా స్టీల్‌ 3.18%, భారతీ ఎయిర్‌టెల్‌ 2.83%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.77%, ఎల్‌ అండ్‌ టీ 2.38%, యాక్సిస్‌ బ్యాంక్‌ 2.22%, బజాజ్‌ ఫైనాన్స్‌ 2.11%, ఇన్ఫోసిస్‌ 2.09%, డాక్టర్‌ రెడ్డీస్‌ 2.06% మేర డీలాపడ్డాయి. హెచ్‌యూఎల్‌, మారుతీ, నెస్లే, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2.68% వరకు లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో టెలికాం, మన్నికైన వినిమయ వస్తువులు, స్థిరాస్తి, యంత్ర పరికరాలు, పరిశ్రమలు 3.03% వరకు తగ్గాయి. ఎఫ్‌ఎమ్‌సీజీ ఒక్కటే రాణించింది. బీఎస్‌ఈలో 2466 షేర్లు నష్టాల్లో ముగియగా, 926 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 74 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని