
దేశంలోని ప్రధాన 1,000 నగరాల్లో 5జీ ప్రణాళికలు పూర్తి: జియో
దిల్లీ: దేశంలోని ప్రముఖ 1000 నగరాల్లో 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రణాళికను పూర్తి చేసినట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ వెల్లడించింది. అలాగే ఈ ప్రాంతాల్లో ఫైబర్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ప్రయోగాత్మక పనులూ జరుగుతున్నాయని కంపెనీ ప్రెసిడెంట్ కిరణ్ థామస్ తెలిపారు. ‘5జీ అనేది ఒక భిన్నమైన సాంకేతికత అయినందున.. దీనికి సంబంధించి నెట్‌వర్క్ ప్రణాళికకు అత్యంత అధునాతన విధానాలను మేం ఉపయోగిస్తున్నాం. ముఖ్యంగా 3డీ మ్యాప్స్, రే ట్రేసింగ్ టెక్నాలజీ లాంటివి వాడుతున్నాం. మాకు అనుమతులు లభిస్తే.. ఈ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని రకాలుగా సన్నద్ధం చేసుకుంటున్నామ’ని థామస్ తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 5జీ స్పెక్ట్రమ్ వేలం నిర్వహించే అవకాశం ఉంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.