వచ్చే కొన్నేళ్లలో జమ్ము కశ్మీర్‌కు రూ.50,000 కోట్ల పెట్టుబడులు

వచ్చే కొన్నేళ్లలో జమ్ము కశ్మీర్‌కు రూ.50,000 కోట్ల పెట్టుబడులు తరలి వస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా శనివారం వెల్లడించారు. ఇప్పటికే రూ.12,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయని

Published : 23 Jan 2022 02:56 IST

5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా

దిల్లీ: వచ్చే కొన్నేళ్లలో జమ్ము కశ్మీర్‌కు రూ.50,000 కోట్ల పెట్టుబడులు తరలి వస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా శనివారం వెల్లడించారు. ఇప్పటికే రూ.12,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. డిస్ట్రిక్ట్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ఇండెక్స్‌ను (డీజీజీఐ) దృశ్య మాధ్యమ విధానంలో విడుదల చేసిన అమిత్‌ షా మాట్లాడారు. ప్రధాని మోదీ జమ్ము కశ్మీర్‌కు రూపొందించిన ఉత్తమ పారిశ్రామిక విధానంతో.. రాబోయే భారీ పెట్టుబడులతో ఇక్కడి 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే గత 70 ఏళ్లలో ఇక్కడ రూ.12,000 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయని గుర్తు చేశారు. కాగా ఒక ఏడాదిలోనే రూ.12,000 కోట్ల పెట్టుబడుల కోసం అవగాహనా ఒప్పందాలు (ఎంఓయూలు) కుదరడం విశేషమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని