77% పెరిగిన యెస్‌ బ్యాంక్‌ లాభం

యెస్‌ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో రూ.266.43 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఆర్జించిన నికర లాభం రూ.150.77 కోట్లతో పోలిస్తే ఇది 77% అధికం.

Published : 23 Jan 2022 02:57 IST

దిల్లీ: యెస్‌ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో రూ.266.43 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఆర్జించిన నికర లాభం రూ.150.77 కోట్లతో పోలిస్తే ఇది 77% అధికం. మొత్తం ఆదాయం రూ.6,408.53 కోట్ల నుంచి రూ.5,632.03 కోట్లకు తగ్గింది. నికర వడ్డీ ఆదాయం రూ.2,560 కోట్ల నుంచి 31% తగ్గి రూ.1,764 కోట్లకు పరిమితమైంది. స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏలు) 15.36 శాతం నుంచి  14.65 శాతానికి పరిమితమయ్యాయి. నికర ఎన్‌పీఏలు మాత్రం 4.04 శాతం నుంచి 5.29 శాతానికి పెరిగాయి. పన్ను, ఆకస్మిక నిధి మినహా మిగతా కేటాయింపులు రూ.2,089 కోట్ల నుంచి గణనీయంగా తగ్గి రూ.374.64 కోట్లకు పరిమితమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని