రూ.4,000 కోట్ల ఫ్యాబ్‌ ఇండియా ఐపీఓ

లైఫ్‌స్టైల్‌ రిటైల్‌ బ్రాండ్‌ ఫ్యాబ్‌ ఇండియా రూ.4,000 కోట్ల నిధుల్ని సమీకరించేందుకు తొలి పబ్లిక్‌ ఆఫర్‌కు (ఐపీఓ) రాబోతోంది. అలాగే కంపెనీ ప్రమోటర్లు 7 లక్షల షేర్లను కళాకారులు, రైతులకు బహుమతిగా ఇచ్చేందుకు

Published : 23 Jan 2022 02:58 IST

7 లక్షల షేర్లను కళాకారులు, రైతులకు బహుమతిగా ఇవ్వనున్న ప్రమోటర్లు

దిల్లీ: లైఫ్‌స్టైల్‌ రిటైల్‌ బ్రాండ్‌ ఫ్యాబ్‌ ఇండియా రూ.4,000 కోట్ల నిధుల్ని సమీకరించేందుకు తొలి పబ్లిక్‌ ఆఫర్‌కు (ఐపీఓ) రాబోతోంది. అలాగే కంపెనీ ప్రమోటర్లు 7 లక్షల షేర్లను కళాకారులు, రైతులకు బహుమతిగా ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రూ.500 కోట్ల విలువైన తాజా షేర్ల ఇష్యూకు అనుమతి కోరుతూ సెబీకి శనివారం ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) పద్ధతిలో 2,50,50,543 షేర్లను కూడా విక్రయించబోతోంది. మార్కెట్‌ వర్గాల ప్రకారం ఐపీఓ విలువ రూ.4,000 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. కంపెనీ ప్రమోటర్లు అయిన బిమ్లా నందా బిస్సెల్‌, మధుకరర్‌ ఖేరాలు వరుసగా 4 లక్షల షేర్లు, 3,75,080 షేర్లను తమతో కలిసి పని చేస్తున్న కళాకారులు, రైతులకు బహుమతిగా ఇచ్చేందుకు ముందుకు రావడం విశేషం. ఈ ఐపీఓకు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, క్రెడిట్‌ సూయిజ్‌ సెక్యూరిటీస్‌ (ఇండియా) ప్రై.లి., జేపీ మోర్గాన్‌ ఇండియా ప్రై.లి., నోమురా ఫైనాన్షియల్‌ అడ్వైజరీ అండ్‌ సెక్యూరిటీస్‌ (ఇండియా) ప్రై.లి., ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ లిమిటెడ్‌, ఈక్విరస్‌ క్యాపిటల్‌ ప్రై.లి, లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని