హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఆదాయం రూ.667 కోట్లు

హెరిటేజ్‌ ఫుడ్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ఖాతాల ప్రకారం రూ.667 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలం ఆదాయంతో పోల్చితే ఇది 10.3 శాతం అధికం. అదే నికరలాభం

Published : 23 Jan 2022 03:00 IST

ఈనాడు, హైదరాబాద్‌: హెరిటేజ్‌ ఫుడ్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ఖాతాల ప్రకారం రూ.667 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలం ఆదాయంతో పోల్చితే ఇది 10.3 శాతం అధికం. అదే నికరలాభం రూ.20.8 కోట్లు ఉంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో నికరలాభం రూ.46.4 కోట్లు ఉండటం గమనార్హం. ఇక ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల కాలానికి హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఆదాయం రూ.1,985 కోట్లు, నికరలాభం రూ.83.9 కోట్లు ఉన్నాయి. ప్రస్తుత మూడో త్రైమాసికంలో రోజుకు సగటున 12 లక్షల లీటర్ల పాలు సేకరించినట్లు హెరిటేజ్‌ ఫుడ్స్‌ వెల్లడించింది. రోజు వారీగా పాలు, పెరుగు అమ్మకాలు సైతం పెరిగినట్లు వివరించింది. ఈ మూడో త్రైమాసికంలో పలు కొత్త ఉత్పత్తులను మార్కెట్‌కు అందించినట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బ్రాహ్మణి నారా తెలిపారు. దీనివల్ల విలువ ఆధారిత ఉత్పత్తుల (వాల్యూ యాడెడ్‌ ప్రోడక్ట్స్‌) ఆదాయం పెరిగినట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సహజ సిద్ధమైన ‘ఫ్రెంచి ప్రొబయాటిక్‌ యోగర్ట్‌’ను విడుదల చేసినట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని