
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.6,537 కోట్లు
దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్ రూ.6,536.55 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో బ్యాంకు ఆర్జించిన నికర లాభం రూ.5,498.15 కోట్లతో పోలిస్తే ఇది 19 శాతం అధికం. మొత్తం ఆదాయం రూ.40,419.08 కోట్ల నుంచి రూ.39,865.80 కోట్లకు తగ్గింది. స్టాండలోన్ ప్రాతిపదికన, బ్యాంక్ నికర లాభం రూ.4,939.59 కోట్ల నుంచి 25 శాతం వృద్ధి చెంది, రూ.6,194 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ.24,416 కోట్ల నుంచి రూ.27,069.67 కోట్లకు పెరిగింది.
* నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) రూ.9,912 కోట్ల నుంచి 23 శాతం పెరిగి రూ.12,236 కోట్లకు ఎగబాకింది.
* నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 3.67% నుంచి 3.96 శాతానికి చేరింది.
* స్థూల నిరర్థక ఆస్తులు 4.38% నుంచి 4.13 శాతానికి మెరుగయ్యాయి. నికర ఎన్పీఏల నిష్పత్తి 0.63 శాతం నుంచి 0.85 శాతానికి చేరింది.
* పన్ను, ఆకస్మిక నిధికి మినహా కేటాయింపులు రూ.2,741 కోట్ల నుంచి రూ.2,007.30 కోట్లకు తగ్గాయి. కేటాయింపుల కవరేజీ నిష్పత్తి 2021 డిసెంబరు 31 నాటికి 79.9 శాతానికి చేరింది.
* రైటాఫ్‌లు, విక్రయాలు మినహా ఎన్పీఏల రికవరీలు, అప్గ్రేడ్లు సమీక్షా త్రైమాసికంలో రూ.4,209 కోట్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో రూ.4,088 కోట్ల స్థూల ఎన్పీఏలను బ్యాంక్ రైటాఫ్ చేసింది.
* బ్యాంక్ మొత్తం మూలధన కనీస నిష్పత్తి 19.79 శాతానికి చేరింది.
* స్టాండలోన్ ప్రాతిపదికన, ఏప్రిల్-డిసెంబరు కాలానికి పన్ను తర్వాత లాభం రూ.11,790 కోట్ల నుంచి 38% పెరిగి రూ.16,321 కోట్లకు పెరిగింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.