జీవిత బీమా తప్పనిసరి

కొవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో అందరి దృష్టీ ఆర్థిక ప్రణాళికలపైనే ఉంది. ముఖ్యంగా ఆర్థిక భరోసాకు జీవిత బీమా పాలసీ తీసుకోవాలని అధిక శాతం భావిస్తున్నారు. ‘ఎస్‌బీఐ లైఫ్‌ ఫైనాన్షియల్‌ ఇమ్యూనిటీ సర్వే 2.0’ నివేదికలో

Published : 23 Jan 2022 03:04 IST

78 శాతం భారతీయుల అభిప్రాయమిది

ఎస్‌బీఐ లైఫ్‌ నివేదికలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో అందరి దృష్టీ ఆర్థిక ప్రణాళికలపైనే ఉంది. ముఖ్యంగా ఆర్థిక భరోసాకు జీవిత బీమా పాలసీ తీసుకోవాలని అధిక శాతం భావిస్తున్నారు. ‘ఎస్‌బీఐ లైఫ్‌ ఫైనాన్షియల్‌ ఇమ్యూనిటీ సర్వే 2.0’ నివేదికలో వెల్లడైన వివరాల ప్రకారం. దాదాపు 78శాతం భారతీయులు తమ ఆర్థిక ప్రణాళికల్లో జీవిత బీమా ఎంతో కీలకమని భావిస్తున్నారు.

* మార్చి 2020 తర్వాత 44 శాతం మంది కొత్తగా జీవిత బీమా, 46 శాతం మంది ఆరోగ్య బీమాను తొలిసారిగా తీసుకున్నారు.

* వైద్య చికిత్స ఖర్చులు పెరిగాయని సర్వేలో పాల్గొన్న 59%  ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థికంగా బలంగా ఉండటమే ఇప్పుడు కీలకమని 57 శాతం భారతీయులు భావన.

* ప్రతి నలుగురు భారతీయుల్లో ముగ్గురు తమ పొదుపు, పెట్టుబడులను పెంచుకోవాలని, 50% పొదుపు, పెట్టుబడులతోపాటు బీమాకూ ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటున్నారు.

* వార్షిక ఆదాయంతో పోల్చినప్పుడు బీమా విలువ 3.8గానే ఉంటోంది. వార్షికాదాయానికి 10-25 రెట్లు ఉండాలనే సూచనకు ఇది చాలా తక్కువ.

* జీవితంలో దశలు మారినప్పుడల్లా బీమా విలువను పెంచుకోవాలని 70శాతం భావిస్తున్నారు.

ఈ సర్వేను దేశవ్యాప్తంగా 28 నగరాల్లో నిర్వహించినట్లు ఎస్‌బీఐ లైఫ్‌ వెల్లడించింది. మహమ్మారి వేళ ప్రజలు ఎక్కువగా ఆందోళన చెందుతున్న అంశాలను తెలుసుకునేందుకు ఎస్‌బీఐ ఈ ప్రయత్నం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని