జీలకర్రలో అమ్మకాలు!

పసిడి ఫిబ్రవరి కాంట్రాక్టుకు ఈవారం అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కమిటీ తీసుకునే నిర్ణయాలు ప్రధానంగా దిశానిర్దేశం చేస్తాయి. సాంకేతికంగా కాంట్రాక్టు మరింత పెరిగే అవకాశం ఉంది. రూ.47,780 కంటే కిందకు దిగిరానంత వరకు సానుకూల ధోరణి కొనసాగుతుంది.

Updated : 24 Jan 2022 04:40 IST

కమొడిటీస్‌
ఈ వారం


బంగారం

సిడి ఫిబ్రవరి కాంట్రాక్టుకు ఈవారం అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కమిటీ తీసుకునే నిర్ణయాలు ప్రధానంగా దిశానిర్దేశం చేస్తాయి. సాంకేతికంగా కాంట్రాక్టు మరింత పెరిగే అవకాశం ఉంది. రూ.47,780 కంటే కిందకు దిగిరానంత వరకు సానుకూల ధోరణి కొనసాగుతుంది. అయితే రూ.48,602 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయినీ అధిగమిస్తే రూ.48,968 వరకు పెరగొచ్చు. అదే సమయంలో రూ.47,780 కంటే దిగువకు వస్తే రూ.47,414 వరకు దిగివస్తుందని భావించవచ్చు. ఇవే కాకుండా అమెరికా విడుదల చేసే ఇతర కీలక ఆర్థిక గణాంకాలు కూడా కాంట్రాక్టు కదలికలపై ప్రభావం చూపుతాయి.

* ఎంసీఎక్స్‌ బుల్‌డెక్స్‌ ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం రూ.14,143 కంటే దిగువన కదలాడకుంటే.. రూ.14,504; రూ.14,653 వరకు పెరిగే అవకాశం ఉంటుంది.


వెండి

* వెండి మార్చి కాంట్రాక్టు ఈవారం రూ.65,159 కంటే ఎగువన కదలాడితే రూ.66,328; రూ.67,083 వరకు రాణించేందుకు అవకాశం ఉంటుంది. అయితే రూ.67,837 దరిదాపులో నిరోధం ఎదురయ్యే అవకాశం ఉన్నందున కొత్తగా లాంగ్‌ పొజిషన్ల జోలికి వెళ్లకపోవడం మంచిది.


ప్రాథమిక లోహాలు

* ఎంసీఎక్స్‌ మెటల్‌డెక్స్‌ ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం రూ.17,967 కంటే దిగువన కదలాడకుంటే.. మరింత పెరగవచ్చు. ఒకవేళ రూ.17,771 కంటే కిందకు వస్తే దిద్దుబాటుకు ఆస్కారం ఉంటుంది.

* రాగి ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం రూ.743 కంటే దిగువన ట్రేడయితే ప్రతికూల ధోరణికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ స్థాయికి పైన కదలాడితే కొనుగోళ్లకు మొగ్గుచూపొచ్చు.

* సీసం ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం రూ.184.30 కంటే కిందకు రాకుంటే.. మరింతగా రాణిస్తుందని భావించవచ్చు. రూ.188; రూ.190.60 లక్ష్యాలతో రూ.184 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకొని రూ.185.55- రూ.184.80 మధ్య కొనుగోళ్లకు మొగ్గు చూపడం మంచిదే.

* జింక్‌ ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం రూ.289.15 కంటే దిగువన కదలాడకుంటే.. పెరిగేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే ఈ లాంగ్‌ పొజిషన్లున్న ట్రేడర్లు రూ.289 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకొని వాటిని కొనసాగించడం మంచి వ్యూహమే అవుతుంది.

* అల్యూమినియం ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం రూ.235.15 కంటే దిగువకు రాకుంటే.. లాంగ్‌ పొజిషన్లను అట్టేపెట్టుకోవచ్చు.

* నికెల్‌ ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం రూ.1705.20 కంటే దిగువన ట్రేడయితే రూ.1,672; రూ.1,616 వరకు దిద్దుబాటు అయ్యేందుకు అవకాశం ఉంది.


ఇంధన రంగం

* సహజవాయువు ఫిబ్రవరి కాంట్రాక్టును ఈవారం రూ.257 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకొని రూ.265;  రూ.277మధ్య కొనుగోళ్లకు మొగ్గు చూపడం మంచిదే.

* ముడి చమురు ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం  రూ.6,256 కంటే పైకి వెళ్లకుంటే రూ.6,156; ఆ తర్వాత రూ.6,078 వరకు దిద్దుబాటు అయ్యేందుకు అవకాశం ఉంది. ఒకవేళ రూ.6,434 కంటే పైకి వెళితేనే.. సానుకూల ధోరణికి ఆస్కారం ఉంటుంది.


వ్యవసాయ ఉత్పత్తులు

* పసుపు ఏప్రిల్‌ కాంట్రాక్టు ఈవారం రూ.10,954 కంటే పైన కదలాడకుంటే రూ.10,011; రూ.9,758 వరకు దిద్దుబాటు అవుతుందని భావించవచ్చు. ఒకవేళ రూ.10,954 ఎగువన చలిస్తే రూ.11,550 వరకు పెరిగే అవకాశం ఉంటుంది.

* జీలకర్ర ఏప్రిల్‌ కాంట్రాక్టును ఈవారం రూ.18,748 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకొని రూ.17,653 లక్ష్యంతో షార్ట్‌ సెల్‌ పొజిషన్లు తీసుకోవచ్చు.

* పత్తి ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం రూ.37,616 కంటే పైన కదలాడకుంటే రూ.35,496 లక్ష్యంతో షార్ట్‌ సెల్‌ చేయడం మంచిదే.

- ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని