ఆరోగ్య సంరక్షణ రంగానికి నిధులు పెంచాలి

ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో ఆరోగ్య సంరక్షణ రంగానికి నిధుల కేటాయింపు పెంచాలని దేశీయ ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమ అభ్యర్థిస్తోంది. ఈ రంగంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కార్యకలాపాలను ప్రోత్సహించే విధానాలపై దృష్టి సారించడంతో

Published : 24 Jan 2022 02:16 IST

ఫార్మా పరిశ్రమ బడ్జెట్‌ వినతి

దిల్లీ: ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో ఆరోగ్య సంరక్షణ రంగానికి నిధుల కేటాయింపు పెంచాలని దేశీయ ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమ అభ్యర్థిస్తోంది. ఈ రంగంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కార్యకలాపాలను ప్రోత్సహించే విధానాలపై దృష్టి సారించడంతో పాటు వివిధ ఔషధాలపై పన్ను రాయితీలను కొనసాగించాలని కోరింది. ప్రైవేటు రంగంలోని కంపెనీలు వ్యాపారాన్ని సులభతరంగా నిర్వహించేందుకు వివిధ ప్రక్రియలను సరళీకృతం చేయాలని పరిశ్రమ అడుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఆరోగ్య సంరక్షణ రంగానికి జీడీపీలో 1.8 శాతం మాత్రమే నిధులు కేటాయించారని, వచ్చే బడ్జెట్‌లో 2.5- 3 శాతం వరకు నిధుల కేటాయింపు పెంచాలని ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రొడ్యూసర్స్‌ ఆఫ్‌ ఇండియా (ఓపీపీఐ) ప్రెసిడెంట్‌ ఎస్‌.శ్రీధర్‌ కోరారు. అలాగే బయోఫార్మాస్యూటికల్‌ రంగ ఆర్‌అండ్‌డీ కార్యకలాపాలకు ప్రత్యేక కేటాయింపులు జరపాలన్నారు. ఫార్మా రంగంలో సులభతర వ్యాపార నిర్వహణను మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ అలియన్స్‌ (ఐపీఏ) సెక్రెటరీ జనరల్‌ సుదర్శన్‌ జైన్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని