కార్పొరేట్‌ పాలనా సమస్యలను పరిష్కరించుకోండి

కార్పొరేట్‌ పరిపాలన, ఇతర వ్యవహారాలపై పీటీసీ ఇండియా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (పీఎఫ్‌ఎస్‌) మాజీ ఛైర్మన్‌, రాజీనామా చేసి వైదొలిగిన స్వతంత్ర డైరెక్టర్లు లేవనెత్తిన అంశాలను పరిష్కరించుకున్నాకే బోర్డు సమావేశాన్ని నిర్వహించాలని పీఎఫ్‌ఎస్‌కు సెబీ

Published : 25 Jan 2022 02:35 IST

ఆ తర్వాతే బోర్డు సమావేశం
పీఎఫ్‌ఎస్‌కు సెబీ సూచన

దిల్లీ: కార్పొరేట్‌ పరిపాలన, ఇతర వ్యవహారాలపై పీటీసీ ఇండియా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (పీఎఫ్‌ఎస్‌) మాజీ ఛైర్మన్‌, రాజీనామా చేసి వైదొలిగిన స్వతంత్ర డైరెక్టర్లు లేవనెత్తిన అంశాలను పరిష్కరించుకున్నాకే బోర్డు సమావేశాన్ని నిర్వహించాలని పీఎఫ్‌ఎస్‌కు సెబీ సూచించింది. ఈ వ్యవహారాలపై ఎలాంటి చర్యలు చేపట్టారనే దానిపై నాలుగు వారాల్లోగా నివేదిక సమర్పించాలని కూడా కంపెనీని ఆదేశించింది.. పీఎఫ్‌ఎస్‌ బోర్డు డైరెక్టర్ల సమావేశం ఈనెల 22న జరగాల్సి ఉంది. అయితే సెబీ నిబంధనల మేరకు ఉండాల్సిన సంఖ్యలో సభ్యులు లేనందున, ఆ సమావేశం జరగలేదని ఎక్స్ఛేంజీలకు కంపెనీ తెలిపింది. కార్పొరేట్‌ పాలన సహా మరికొన్ని అంశాలను కారణాలుగా చెబుతూ పీఎఫ్‌ఎస్‌లోని ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లు కమలేశ్‌ శివ్జి వికామ్సే, సంతోష్‌ బి నాయర్‌, థామస్‌ మ్యాథ్యూ జనవరి 19న మూకుమ్మడిగా రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. వీళ్ల గైర్హాజరీతో జనవరి 22న బోర్డు సమావేశాన్ని పీఎఫ్‌ఎస్‌ నిర్వహించుకోలేకపోయింది. బోర్డు సమావేశం కంటే ముందు, కంపెనీ నుంచి వైదొలిగిన డైరెక్టర్లు, మాజీ ఛైర్మన్‌ లేవనెత్తిన సమస్యలను పరిష్కరించుకోవాలని సెబీ సూచించడం గమనార్హం. స్వతంత్ర డైరెక్టర్ల నియామకం కోసం సెబీ నిబంధనల నుంచి మినహాయింపును కోరుతూ సెబీకి పీఎఫ్‌ఎస్‌ దరఖాస్తు పెట్టుకుంది. ప్రస్తుతం పీఎఫ్‌ఎస్‌ బోర్డులో ముగ్గురు సభ్యులే ఉన్నారు. వీరిలో పీటీసీ ఇండియా సీఎండీ రజీబ్‌ కుమార్‌ మిశ్రా, పీటీసీ ఇండియా సీఎఫ్‌ఓ పంకజ్‌ గోయల్‌, పీఎఫ్‌ఎస్‌ ఎండీ, సీఈఓ పవన్‌ సింగ్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు