31న దిల్లీ హైకోర్టులో హాజరవ్వండి

దిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ), రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు చెందిన దిల్లీ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో ఎక్స్‌ప్రెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (డీఏఎంఈపీఎల్‌)ను జనవరి 31న దిల్లీ హైకోర్టు ఎదుట హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. డీఏఎంఈపీఎల్‌కు

Published : 25 Jan 2022 02:36 IST

డీఎంఆర్‌సీ, డీఏఎంఈపీఎల్‌కు సుప్రీంకోర్టు ఆదేశం

దిల్లీ: దిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ), రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు చెందిన దిల్లీ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో ఎక్స్‌ప్రెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (డీఏఎంఈపీఎల్‌)ను జనవరి 31న దిల్లీ హైకోర్టు ఎదుట హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. డీఏఎంఈపీఎల్‌కు రూ.4,600 కోట్ల చెల్లింపు ఆదేశాలకు సంబంధించిన కేసును సాధ్యమైనంత త్వరగా విచారించాల్సిందిగా దిల్లీ హైకోర్టును సుప్రీంకోర్టు కోరింది. ఈ కేసు విచారణ ఇంకా ఆలస్యమైతే ఇరు పక్షాలకూ మంచిది కాదని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ బి.ఆర్‌.గవైలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. డీఏఎంఈపీఎల్‌కు డీఎంఆర్‌సీ రూ.4,600 కోట్లు చెల్లించాలంటూ 2017లో ఇచ్చిన ఆదేశాలను 2021 సెప్టెంబరు 9న సుప్రీంకోర్టు సమర్థించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని