భువనగిరిలో ఏజీఐ గ్లాస్‌ప్యాక్‌

కంటెయినర్‌ గ్లాస్‌ బాటిల్‌ ఉత్పత్తి చేసే సంస్థ ఏజీఐ గ్లాస్‌ప్యాక్‌, హైదరాబాద్‌ సమీపంలోని భువనగిరిలో స్పెషాలిటీ గ్లాస్‌ కోసం కొత్త యూనిట్‌ను ప్రారంభించింది. రోజుకు 154 టన్నుల (టీపీడీ) ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ

Published : 25 Jan 2022 02:43 IST

‘స్పెషాలిటీ గ్లాస్‌’ యూనిట్‌ ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: కంటెయినర్‌ గ్లాస్‌ బాటిల్‌ ఉత్పత్తి చేసే సంస్థ ఏజీఐ గ్లాస్‌ప్యాక్‌, హైదరాబాద్‌ సమీపంలోని భువనగిరిలో స్పెషాలిటీ గ్లాస్‌ కోసం కొత్త యూనిట్‌ను ప్రారంభించింది. రోజుకు 154 టన్నుల (టీపీడీ) ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్లో కాస్మొటిక్స్‌, ఫార్మాస్యూటికల్‌, ప్రీమియం స్పిరిట్స్‌ పరిశ్రమలకు అవసరమైన నెయిల్‌ పాలిష్‌ సీసాలు, వయల్స్‌, వైన్‌ సీసాలు, క్యాండిల్‌ జార్లు ఉత్పత్తి చేస్తారు.

350 ఉద్యోగాలు: దాదాపు 350 మందికి ఈ కొత్త యూనిట్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఇక్కడ ఏటా రూ.250 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసే అవకాశం ఉన్నట్లు ఏజీఐ గ్లాస్‌ప్యాక్‌ సీఈఓ రాజేష్‌ ఖోస్లా అన్నారు. స్పెషాలిటీ గ్లాస్‌ ఉత్పత్తుల విభాగంలో 10- 15 శాతం మార్కెట్‌ వాటా సంపాదించడం తమ లక్ష్యమని ఆయన వివరించారు. అత్యంత అధునాతన యంత్ర సామగ్రిని ఈ యూనిట్లో నెలకొల్పినట్లు తెలిపారు. సమీప భవిష్యత్తులో ఈ యూనిట్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇంకా పెంచుతామని అన్నారు. ఏజీఐ గ్లాస్‌ప్యాక్‌ పలు రకాల గ్లాస్‌ ఉత్పత్తులను ఉత్తర అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా పసిఫిక్‌ దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఈ సంస్థకు హైదరాబాద్‌, భువనగిరిలలో యూనిట్లు ఉన్నాయి. ఈ యూనిట్లలో రోజుకు 1600 టన్నుల గ్లాస్‌ను కరిగించి, పలు రకాల గ్లాస్‌ ఉత్పత్తులు సిద్ధం చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని