టాటా టెక్‌లో 3,000 నియామకాలు

గ్లోబల్‌ ఇంజినీరింగ్‌, ప్రోడక్ట్‌ డెవలప్‌మెంట్‌ డిజిటల్‌ సేవల సంస్థ టాటా టెక్నాలజీస్‌ వచ్చే 12 నెలల్లో 3,000 మందికి పైగా ఇన్నోవేటర్లను నియమించుకోబోతున్నట్లు సోమవారం వెల్లడించింది.

Published : 25 Jan 2022 02:46 IST

దిల్లీ: గ్లోబల్‌ ఇంజినీరింగ్‌, ప్రోడక్ట్‌ డెవలప్‌మెంట్‌ డిజిటల్‌ సేవల సంస్థ టాటా టెక్నాలజీస్‌ వచ్చే 12 నెలల్లో 3,000 మందికి పైగా ఇన్నోవేటర్లను నియమించుకోబోతున్నట్లు సోమవారం వెల్లడించింది. అంతర్జాతీయంగా తమ ప్రధాన విపణుల్లోనే కాకుండా దేశీయంగా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు తదితర చోట్ల సిబ్బందిని పెంచుకునే ప్రణాళికలో ఉన్నట్లు టాటా టెక్నాలజీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ వారెన్‌ హారిస్‌ వెల్లడించారు. వీరికి పోటీసంస్థలకు దీటుగా వేతనాలు ఇస్తామని, అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. దేశీయంగా, అంతర్జాతీయ ఇ లెర్నిగ్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా నైపుణ్యాల మెరుగుకూ వీలు కల్పిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని