యాక్సిస్‌ బ్యాంక్‌ లాభం మూడు రెట్లు

అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో యాక్సిస్‌ బ్యాంక్‌ ఏకీకృత నికర లాభం సుమారు 3 రెట్లు పెరిగి రూ.3,973 కోట్లకు చేరింది. రుణాల మంజూరులో బలమైన వృద్ధి, ఆస్తుల నాణ్యత మెరుగవ్వడం,

Published : 25 Jan 2022 02:47 IST

దిల్లీ: అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో యాక్సిస్‌ బ్యాంక్‌ ఏకీకృత నికర లాభం సుమారు 3 రెట్లు పెరిగి రూ.3,973 కోట్లకు చేరింది. రుణాల మంజూరులో బలమైన వృద్ధి, ఆస్తుల నాణ్యత మెరుగవ్వడం, కేటాయింపులు గణనీయంగా తగ్గడం ఇందుకు దోహదం చేసింది. స్టాండలోన్‌ పద్ధతలోనూ నికర లాభం రూ.1,116 కోట్ల నుంచి పెరిగి రూ.3,614.24 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం కూడా రూ.18,355 కోట్ల నుంచి రూ.21,101 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 17 శాతం వృద్ధితో రూ.8,653 కోట్లకు చేరింది. వడ్డీయేతర ఆదాయం 15 శాతం పెరిగి రూ.3,344 కోట్లుగా నమోదైంది. మొత్తం కేటాయింపులు రూ.3,750.20 కోట్ల నుంచి తగ్గి రూ.1,334.83 కోట్లకు పరిమితమయ్యాయి. స్థూల నిరర్థక ఆస్తులు 3.53 శాతం నుంచి 3.17 శాతానికి తగ్గాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని