కొనుగోళ్లు-విలీనాలకు రూ.450 కోట్లు: అదానీ విల్మర్‌

ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం అదానీ విల్మర్‌ మరిన్ని కొనుగోళ్ల ద్వారా ఈ విభాగంలో అగ్రస్థానానికి ఎదిగింది. రూ.3,600 కోట్ల సమీకరణ నిమిత్తం ఈ నెల 27 నుంచి సంస్థ పబ్లిక్‌ ఇష్యూకు రాబోతున్న సంగతి విదితమే. సమీకరించిన నిధుల్లో రూ.450

Published : 25 Jan 2022 02:53 IST

ముంబయి: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం అదానీ విల్మర్‌ మరిన్ని కొనుగోళ్ల ద్వారా ఈ విభాగంలో అగ్రస్థానానికి ఎదిగింది. రూ.3,600 కోట్ల సమీకరణ నిమిత్తం ఈ నెల 27 నుంచి సంస్థ పబ్లిక్‌ ఇష్యూకు రాబోతున్న సంగతి విదితమే. సమీకరించిన నిధుల్లో రూ.450 కోట్లను కొనుగోళ్లు-విలీనాలకు అట్టేపెడతామని సంస్థ వెల్లడించింది. వంటనూనెల యేతర వ్యాపారంలో సంస్థల కొనుగోళ్ల ద్వారా వృద్ధి అవకాశాలు బాగుండటంతోనే ఆ దిశగా నిధులు వెచ్చించనున్నట్లు కంపెనీ తెలిపింది. అదానీ గ్రూప్‌, సింగపూర్‌కు చెందిన విల్మర్‌ గ్రూప్‌ సంయుక్త సంస్థగా అదానీ విల్మర్‌ కొనసాగుతోంది. ‘నూనేతర/ఎఫ్‌ఎంసీజీ వ్యాపారంలో ఉన్న వృద్ధి అవకాశాలపై దృష్టి సారించనున్నాం. అందుకు అనుగుణంగా ఐపీఓ ద్వారా సమీకరించే నిధుల్లో రూ.450 కోట్లను గోధుమ పిండి, బియ్యం, రెడీ-టు-కుక్‌ విభాగాల ఆహార తయారీ యూనిట్లను కొనుగోలు చేసేందుకు వినియోగించాలనకుంటున్నామ’ని అదానీ విల్మర్‌ సీఈఓ అన్షు మాలిక్‌ వెల్లడించారు.

వేదాంత్‌ ఫ్యాషన్‌ ఐపీఓకు అనుమతి

పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) ద్వారా నిధులు సమీకరించేందుకు మాన్యవర్‌ బ్రాండ్‌ యజమాని వేదాంత్‌ ఫ్యాషన్స్‌కు సెబీ అనుమతి ఇచ్చింది. ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిలో ఉండబోతోంది. 3,63,64,838 ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ఇతర వాటాదార్లు విక్రయించనున్నారని వేదాంతా ఫ్యాషన్స్‌ పేర్కొంది.

విమానాశ్రయ సేవల ప్లాట్‌ఫామ్‌ డ్రీమ్‌ఫోక్స్‌ సర్వీసెస్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా నిధులు సమీకరించేందుకు అనుమతివ్వాలని సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ఓఎఫ్‌ఎస్‌ ద్వారా 2,18,14,200 ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు లిబెరతా పీటర్‌ కల్లట్‌, దినేశ్‌ నాగ్‌పాల్‌, ముకేశ్‌ యాదవ్‌ విక్రయిస్తారని ఆ పత్రాల్లో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని