ఈ వారంలోనే టాటాలకు ఎయిరిండియా అప్పగింత!

ఎయిరిండియాను ఈ వారం చివరికల్లా టాటా గ్రూపునకు అప్పగించే అవకాశం ఉందని ప్రభుత్వ ఉన్నతాధికారులు సోమవారం వెల్లడించారు. వేలం ప్రక్రియ ద్వారా ఎయిరిండియాను టాటా గ్రూపు అనుబంధ సంస్థ ట్యాలెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ గతేడాది

Published : 25 Jan 2022 02:56 IST

దిల్లీ: ఎయిరిండియాను ఈ వారం చివరికల్లా టాటా గ్రూపునకు అప్పగించే అవకాశం ఉందని ప్రభుత్వ ఉన్నతాధికారులు సోమవారం వెల్లడించారు. వేలం ప్రక్రియ ద్వారా ఎయిరిండియాను టాటా గ్రూపు అనుబంధ సంస్థ ట్యాలెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ గతేడాది అక్టోబరు 8న రూ.18,000 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి విదితమే. ఎయిరిండియాలో 100 శాతం వాటా విక్రయానికి అంగీకారం తెలుపుతూ, లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ను టాటా గ్రూపునకు అక్టోబరు 11న ప్రభుత్వం జారీ చేసింది. అక్టోబరు 25న ఈ లావాదేవీకి సంబంధించి షేర్ల విక్రయ ఒప్పందంపై కేంద్రం సంతకాలు చేసింది. ఈ ఒప్పందానికి సంబంధించి మిగత ప్రక్రియ రాబోయే కొన్ని రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తాజాగా తెలిపారు. ఈ వారం చివరికల్లా ఎయిరిండియాను టాటా గ్రూపునకు అప్పగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒప్పందంలో భాగంగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను కూడా టాటా గ్రూపునకు అప్పగించాల్సి ఉంటుంది. ఎయిరిండియా ఎస్‌ఏటీఎస్‌లోనూ 50 శాతం వాటా టాటాల చేతిలోకి వెళ్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని