హైదరాబాద్‌లో సెరెమార్ఫిక్‌ అభివృద్ధి కేంద్రం

అమెరికాకు చెందిన సెమీకండక్టర్‌ కంపెనీ ‘సెరెమార్ఫిక్‌’, హైదరాబాద్‌లో తన మొదటి అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దాదాపు 35 వేల చదరపు అడుగుల స్థలంలో రూపుదిద్దుకున్న

Published : 26 Jan 2022 03:53 IST

రెండేళ్లలో 400 మంది  ఇంజినీర్లకు ఉద్యోగాలు

సూపర్‌ కంప్యూటింగ్‌ చిప్‌ డిజైనింగ్‌పై దృష్టి

వెంకట్‌

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికాకు చెందిన సెమీకండక్టర్‌ కంపెనీ ‘సెరెమార్ఫిక్‌’, హైదరాబాద్‌లో తన మొదటి అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దాదాపు 35 వేల చదరపు అడుగుల స్థలంలో రూపుదిద్దుకున్న ఈ కేంద్రంలో 150 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2024 నాటికి ఉద్యోగుల సంఖ్య 400 కు పెరుగుతుందని ‘సెరెమార్ఫిక్‌’ వెల్లడించింది. ఏటా రూ.70 కోట్లు పెట్టుబడి పెడుతూ హైదరాబాద్‌ కేంద్రాన్ని విస్తరిస్తామని, సెమీకండక్టర్‌ చిప్‌ అభివృద్ధిపై అధికంగా నిధులు వెచ్చిస్తామని ‘సెరెమార్ఫిక్‌’ సీఈఓ వెంకట్‌ మట్టెల తెలిపారు. తమ ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఐఐటీ- హైదరాబాద్‌ నుంచి ఉన్నట్లు, సమీప భవిష్యత్తులో ఐఐటీ- హైదరాబాద్‌తో కలిసి మ్యాథ్స్‌, ఆల్గోరిథమ్‌ విభాగాల్లో కలిసి పనిచేయాలని భావిస్తున్నట్లు ఆయన వివరించారు. ‘టీఎస్‌ఎంసీ 5ఎన్‌ఎం నోడ్‌’ లో అధికంగా ఆధారపడగలిగిన, అధిక ఇంధన సామర్థ్యం గల సూపర్‌ కంప్యూటింగ్‌ చిప్‌ను 2024 నాటికి విపణికి అందిస్తామని పేర్కొన్నారు. సెమీకండక్టర్స్‌ విభాగంలో ఎంతో నైపుణ్యం ఉన్న ‘సెరిమార్ఫిక్‌’ హైదరాబాద్‌ నుంచి పరిశోధన- అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టడం ముదావహమని, ఇందుకు ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాలుగా సహకారాన్ని అందిస్తామని తెలంగాణ ప్రభుత్వ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌ అన్నారు.

సిలికాన్‌ సిస్టమ్స్‌లో ఈ కంపెనీకి మేథో సంపత్తి (ఐపీ), 100కు పైగా పేటెంట్లు, సుదీర్ఘ అనుభవం ఉన్నాయి. అందువల్ల కృత్రిమ మేధ (ఏఐ), యంత్ర అభ్యాసం (ఎంఎల్‌), హై పవర్‌ కంప్యూటింగ్‌, ఆటోమేటివ్‌ ప్రాసెసింగ్‌, డ్రగ్‌ డిస్కవరీ, డేటా సెంటర్‌.. తదితర విభాగాలకు అవసరమైన సిలికాన్‌ సిస్టమ్స్‌ను ఆవిష్కరించే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. భారీ సమాచారాన్ని (బిగ్‌ డేటా) ప్రాసెస్‌ చేయడానికి సూపర్‌ కంప్యూటింగ్‌ చిప్స్‌ తప్పనిసరని సంస్థ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని