48% తగ్గిన మారుతీ లాభం

దేశీయ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో రూ.1,041.8 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే కాల లాభం రూ.1,996.70 కోట్లతో పోలిస్తే ఇది

Published : 26 Jan 2022 03:53 IST

ఈ త్రైమాసికంలో పూర్తిస్థాయిలో వాహన ఉత్పత్తి

దిల్లీ: దేశీయ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో రూ.1,041.8 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే కాల లాభం రూ.1,996.70 కోట్లతో పోలిస్తే ఇది 47.82 శాతం తక్కువ. సెమీకండక్టర్ల కొరత వల్ల ఉత్పత్తి-విక్రయాలు తగ్గడం, ముడిపదార్థాల ధరలు పెరగడంతో లాభం తగ్గిందని కంపెనీ తెలిపింది. కార్యకలాపాల ఏకీకృత ఆదాయం రూ.23,471.3 కోట్ల నుంచి స్వల్పంగా తగ్గి రూ.23,253.3 కోట్లకు పరిమితమైంది. మొత్తం వాహన విక్రయాలు 4,95,897 నుంచి  13.1% తగ్గి 4,30,668 గా నమోదయ్యాయి. ఎలక్ట్రానిక్‌ పరికరాల సరఫరాలో అంతరాయం వల్ల సమీక్షా త్రైమాసికంలో 90,000 వాహనాల ఉత్పత్తి తగ్గిందని సంస్థ వివరించింది. ‘వాహనాలకు గిరాకీ బాగానే ఉంది. డిసెంబరు ఆఖరుకు 2,40,000కు పైగా  ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్‌ సరఫరా క్రమంగా మెరుగవుతోంది. ప్రస్తుత త్రైమాసికంలో పూర్తి సామర్థ్యంతో వాహన ఉత్పత్తి చేస్తామ’ని కంపెనీ తెలిపింది.

స్టాండలోన్‌ ప్రాతిపదికన, కంపెనీ నికర లాభం రూ.1,941.4 కోట్ల నుంచి రూ.1,011.3 కోట్లకు తగ్గింది. నికర విక్రయాలు రూ.22,236.70 కోట్ల నుంచి రూ.22,187.60 కోట్లకు తగ్గాయి. దేశీయ విపణిలో వాహన విక్రయాలు 4,67,369 నుంచి 3,65,673కు తగ్గాయి. వాహన ఎగుమతులు మాత్రం 28,528 నుంచి గణనీయంగా పెరిగి 64,995కు చేరాయి. 2021-22 ఏప్రిల్‌- డిసెంబరులో సంస్థ ఏకీకృత నికర లాభం రూ.2,003.7 కోట్లకు తగ్గింది. 2020-21 ఇదే కాల లాభం రూ.3,148 కోట్లుగా ఉంది. ఇదే సమయంలో కార్యకలాపాల ఏకీకృత ఆదాయం రూ.46,337.50 కోట్ల నుంచి రూ.61,580.60 కోట్లకు చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని