సుప్రీంలో స్పైస్‌జెట్‌ పిటిషన్‌ విచారణ 28న

స్పైస్‌జెట్‌ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలంటూ లిక్విడేటర్‌కు మద్రాస్‌ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై దాఖలు చేసిన పిటిషన్‌ను ఈనెల 28న విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. స్పైస్‌జెట్‌

Published : 26 Jan 2022 03:52 IST

దిల్లీ: స్పైస్‌జెట్‌ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలంటూ లిక్విడేటర్‌కు మద్రాస్‌ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై దాఖలు చేసిన పిటిషన్‌ను ఈనెల 28న విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. స్పైస్‌జెట్‌ కార్యకలాపాలు నిలిపివేసి, ఆస్తులను టేకోవర్‌ చేసుకోవాలని లిక్విడేటర్‌కు మద్రాస్‌ హైకోర్టు సింగిల్‌ జడ్జి బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలను, ఈ నెల 11న హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సమర్థించడంతో స్పైస్‌జెట్‌ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ కేసును శుక్రవారం లేదా సోమవారం విచారించాలని.. లేకుంటే విమానయాన సంస్థ మూతపడుతుందని సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ కోర్టుకు తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలో న్యాయమూర్తులు జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ హిమ కోహ్లిలతో కూడిన ధర్మాసనం ఇందుకు సుముఖత వ్యక్తం చేసి, 28న విచారిస్తామని వెల్లడించింది. 2011లో కుదుర్చుకున్న ఒప్పందం కింద స్విట్జర్లాండ్‌కు చెందిన ఎస్‌ఆర్‌టీ టెక్నిక్స్‌ నుంచి విమానాల నిర్వహణ, మరమ్మతు, ఓవరాలింగ్‌ సేవలను పదేళ్ల పాటు స్పైస్‌జెట్‌ పొందింది. ఈ లావాదేవీల్లో స్పైస్‌జెట్‌ 24 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.180 కోట్ల) బకాయి పడిందంటూ ఎస్‌ఆర్‌టీ తరఫున క్రెడిట్‌ సూయిజ్‌ కోర్టును ఆశ్రయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని