
గూగుల్‌లో నియామకాలు
ఈనాడు, హైదరాబాద్: అగ్రశ్రేణి ఇంటర్నెట్ సేవల సంస్థ గూగుల్ మనదేశంలో నియామకాలు చేపడుతోంది. ప్రస్తుత కేంద్రాల విస్తరణతో పాటు పుణెలో ఈ ఏడాది ద్వితీయార్థంలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించనుండటమే ఇందుకు కారణం. ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు, గురుగ్రామ్ కేంద్రాల్లో వేగంగా విస్తరిస్తున్నామని, అదనంగా పుణెలో కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు గూగుల్ క్లౌడ్ ఇండియా ఉపాధ్యక్షుడు (క్లౌడ్ ఇంజనీరింగ్) అనిల్ బన్సాలీ తెలిపారు. ఇందుకోసమే నియామకాలు చేపట్టినట్లు వెల్లడించారు. ఉద్యోగార్థులు తమ అధీకృత పోర్టల్‌లో వివరాలు తెలుసుకోవచ్చన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.