
Published : 26 Jan 2022 03:52 IST
హెచ్పీసీఎల్ కొత్త ఛైర్మన్ పుష్ప్ కుమార్ జోషి
దిల్లీ: ప్రభుత్వ రంగ చమురు సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్) కొత్త ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా పుష్ప్ కుమార్ జోషి ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన హెచ్పీసీఎల్ డైరెక్టర్ (మానవ వనరులు)గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 24న 10 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసిన తర్వాత పుష్ప్ కుమార్ జోషిని ఎంపిక చేసినట్లు పీఈఎస్బీ పేర్కొంది. పీఈఎస్బీ సిఫారసు మేôకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) ముందుకు వెళ్లనుంది.
Tags :