
4 నుంచి వేదాంత్ ఫ్యాషన్స్ ఐపీఓ
దిల్లీ: మాన్యవర్ బ్రాండ్ విక్రయశాలలను నిర్వహించే వేదాంత్ ఫ్యాషన్స్ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ఫిబ్రవరి 4న ప్రారంభమై 8న ముగియనుంది. పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో జరిగే ఈ ఇష్యూలో ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదార్లు 3,63,64,838 ఈక్విటీ షేర్లు విక్రయించనున్నారు. ఫలితంగా ఈ ఇష్యూ ద్వారా కంపెనీకి ఎటువంటి నిధులు లభించవు.రైన్ హోల్డింగ్స్ 1.74 కోట్లు, కేదారా క్యాపిటల్ ఆల్టర్‌నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్- కేదారా క్యాపిటల్ ఏఐఎఫ్ 7.23 లక్షల షేర్లు, రవి మోదీ ఫ్యామిలీ ట్రస్ట్ 1.81 కోట్ల షేర్లు విక్రయిస్తారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.