ఆకాశ ఎయిర్‌ కార్యకలాపాలు జూన్‌ లోగా

మే చివర్లో లేదా జూన్‌ ప్రారంభంలో కార్యకలాపాలు ప్రారంభించడానికి రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా నేతృత్వంలోని కొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌ సన్నాహాలు చేస్తోంది. తాము ఆర్డరు చేసిన బోయింగ్‌

Published : 26 Jan 2022 03:52 IST

దిల్లీ: మే చివర్లో లేదా జూన్‌ ప్రారంభంలో కార్యకలాపాలు ప్రారంభించడానికి రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా నేతృత్వంలోని కొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌ సన్నాహాలు చేస్తోంది. తాము ఆర్డరు చేసిన బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాల్లో మొదటిది ఏప్రిల్‌లో చేరొచ్చని సంస్థ భావిస్తోంది.  దేశీయ విమానయాన రంగ దీర్ఘకాల వృద్ధిపై బుల్లిష్‌గా ఉన్న సంస్థ 2023 మార్చికి విమానాల సంఖ్యను 18కి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. విమానయాన సంస్థలపై కొవిడ్‌ ప్రతికూలతలు కొనసాగుతున్నప్పటికీ.. దీర్ఘకాలంలో భారత వాణిజ్య విమానయానం ఆకర్షణీయంగా కనిపిస్తోందని ఆకాశ ఎయిర్‌ సీఈఓ వినయ్‌ దూబే పేర్కొన్నారు. ప్రస్తుత ఇబ్బందులన్నీ తాత్కాలికమని, భవిష్యత్‌లో మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని