2021-22లో భారత వృద్ధి 9 శాతమే: ఐఎంఎఫ్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను 9 శాతానికి పరిమితం చేస్తున్నట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) మంగళవారం ప్రకటించింది. కొవిడ్‌ ఒమిక్రాన్‌ కేసుల విస్తృతి

Published : 26 Jan 2022 03:52 IST

వాషింగ్టన్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను 9 శాతానికి పరిమితం చేస్తున్నట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) మంగళవారం ప్రకటించింది. కొవిడ్‌ ఒమిక్రాన్‌ కేసుల విస్తృతి వల్ల వ్యాపార కార్యకలాపాలు, ప్రజల కదలికలపై ప్రభావం పడిందని సంస్థ పేర్కొంది. జీడీపీ వృద్ధి 9.5 శాతంగా ఉంటుందని గత ఏడాది అక్టోబరులో అంచనా వేసిన ఐఎంఎఫ్‌ తాజాగా 0.5 శాతం కోత విధించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2022-23) దేశ వృద్ధి రేటు అంచనాను 0.5 శాతం పెంచి 7.1 శాతంగా నమోదు కావొచ్చని పేర్కొంది. 2020-21లో భారత ఆర్థిక వ్యవస్థ 7.3 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే.

* ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిపైనా ఈ ఏడాది ఒమిక్రాన్‌ ప్రభావం అధికంగా కనిపిస్తుందని ఐఎంఎఫ్‌ తెలిపింది. 2022లో 4.4% మేర అంతర్జాతీయ వృద్ధి నమోదు కావొచ్చని అంచనా చేసింది. గత ఏడాది అక్టోబరు అంచనా వేసిన 4.9 శాతం కంటే ఇది 0.5 శాతం తక్కువ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు