29% పెరిగిన ఫెడరల్‌ బ్యాంక్‌ లాభం

ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో ఫెడరల్‌ బ్యాంక్‌ రూ.522 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాల లాభం రూ.404.10 కోట్లతో పోలిస్తే ఇది 29 శాతం

Published : 26 Jan 2022 04:53 IST

దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో ఫెడరల్‌ బ్యాంక్‌ రూ.522 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాల లాభం రూ.404.10 కోట్లతో పోలిస్తే ఇది 29 శాతం ఎక్కువ. మొత్తం ఆదాయం రూ.3,934.90 కోట్ల నుంచి స్వల్పంగా తగ్గి    రూ.3,926.75 కోట్లకు చేరింది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు)  2.71 శాతం నుంచి 3.06 శాతానికి; నికర ఎన్‌పీఏలు 0.60 శాతం నుంచి 1.05 శాతానికి పెరిగాయి. పన్ను, ఇతర ఆకస్మిక నిధి మినహా కేటాయింపులు రూ.414.16 కోట్ల నుంచి రూ.213.98 కోట్లకు తగ్గాయి. 2021 డిసెంబరు ఆఖరుకు నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) 3.27 శాతంగా నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని