‘అవర్‌ ఫుడ్‌’కు రూ.45 కోట్ల మూలధనం

అగ్రిటెక్‌ అంకుర సంస్థ ‘అవర్‌ ఫుడ్‌’ తన విస్తరణ అవసరాల కోసం రూ.45 కోట్ల మూలధన నిధులు సమీకరించింది. ఇప్పటికే పెట్టుబడి పెట్టిన 3 లైన్స్‌ వెంచర్‌ కేపిటల్‌తో పాటు, సీ4డీ

Published : 26 Jan 2022 04:53 IST

ఈనాడు, హైదరాబాద్‌: అగ్రిటెక్‌ అంకుర సంస్థ ‘అవర్‌ ఫుడ్‌’ తన విస్తరణ అవసరాల కోసం రూ.45 కోట్ల మూలధన నిధులు సమీకరించింది. ఇప్పటికే పెట్టుబడి పెట్టిన 3 లైన్స్‌ వెంచర్‌ కేపిటల్‌తో పాటు, సీ4డీ ఆసియా ఫండ్‌ ఈ నిధులు అందించాయి. 3 లైన్స్‌ వెంచర్స్‌ ఇండియా ఛైర్మన్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మాజీ సీఈఓ లలిత్‌ జలాన్‌ ‘అవర్‌ ఫుడ్‌’ బోర్డులో డైరెక్టర్‌గా చేరారు.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, కర్ణాటక రాష్ట్రాల్లో తమ కార్యకలాపాలు సాగుతున్నాయని అవర్‌ ఫుడ్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ బాలారెడ్డి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని