బ్రైట్‌కామ్‌ గ్రూపు వాటాదార్లకు బోనస్‌ షేర్లు

హైదరాబాద్‌కు చెందిన బ్రైట్‌కామ్‌ గ్రూపు వాటాదార్లకు బోనస్‌ ప్రకటించింది. 2: 3 నిష్పత్తిలో (వాటాదార్ల వద్ద ఉన్న ప్రతి 3 షేర్లకు 2 చొప్పున) బోనస్‌ షేర్లు ఇవ్వాలని డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది.

Published : 27 Jan 2022 03:42 IST

2:3 నిష్పత్తిలో ఇవ్వాలని నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన బ్రైట్‌కామ్‌ గ్రూపు వాటాదార్లకు బోనస్‌ ప్రకటించింది. 2: 3 నిష్పత్తిలో (వాటాదార్ల వద్ద ఉన్న ప్రతి 3 షేర్లకు 2 చొప్పున) బోనస్‌ షేర్లు ఇవ్వాలని డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి ఆర్థిక ఫలితాలను కంపెనీ ప్రకటించింది. రూ.2,021 కోట్ల ఆదాయంపై రూ.371 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదేకాలంతో పోల్చినప్పుడు ఆదాయం 130 శాతం, నికరలాభం 167 శాతం పెరిగినట్లు కంపెనీ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్‌ మీడియా సేవల వినియోగం గణనీయంగా పెరుగుతున్నందున మెరుగైన ఆదాయాలు, లాభాలు నమోదు చేసే అవకాశం ఉందని, అందువల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న ఆదాయ లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉన్నట్లు బ్రైట్‌కామ్‌ గ్రూపు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని