వడ్డీరేట్ల పెంపు త్వరలో : ఫెడ్‌

ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ‘అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌’ నిర్ణయాలు బుధవారం అర్ధరాత్రి 12.40 గంటల సమయంలో వెలువడ్డాయి.  

Published : 27 Jan 2022 03:42 IST

ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ‘అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌’ నిర్ణయాలు బుధవారం అర్ధరాత్రి 12.40 గంటల సమయంలో వెలువడ్డాయి.  వడ్డీ రేట్ల పెంపు త్వరలో ఉంటుందని ఫెడ్‌ సంకేతాలు ఇచ్చింది. ఆర్థిక కార్యకలాపాలు, ఉద్యోగాల కల్పన బలోపేతం అవుతోందని పేర్కొంది. కొవిడ్‌ కేసుల వ్యాప్తిపైనే ఆర్థిక వ్యవస్థ తీరు ఆధారపడి ఉంటుందని వివరించింది. అమెరికా ద్రవ్యోల్బణం దాదాపు 40 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరింది. ‘ద్రవ్యోల్బణం 2 శాతం ఎగువన ఉంది. అయితే ఉద్యోగ విపణి చాలా బలంగా ఉంది. ఫెడరల్‌ ఫండ్స్‌ రేటును (0 - 0.25 శాతం నుంచి) పెంచడాన్ని త్వరలో ప్రారంభించాలని కమిటీ భావిస్తోంది’ అని ఫెడ్‌ తెలిపింది.  నెలవారీ బాండ్ల కొనుగోళ్ల కార్యక్రమం మార్చిలో ముగిసే అవకాశం ఉందని సంకేతాలిచ్చింది. ఇదే సమయంలో రేట్ల పెంపు చేపట్టే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని